భారతీయ సినిమా రంగంపై కనీస పరిజ్ఞానం గల వారెవరికైన కమల్ హసన్ గురించి తెలియదంటే అతిశయోక్తే అని అనుకోవాలి. సినిమారంగంపై ఆయన అంతలా తనదైన ముద్ర వేసారు.
భారతీయ సినిమా రంగంపై కనీస పరిజ్ఞానం గల వారెవరికైన కమల్ హసన్ గురించి తెలియదంటే అతిశయోక్తే అని అనుకోవాలి. సినిమారంగంపై ఆయన అంతలా తనదైన ముద్ర వేసారు. ఈ దిగ్గజ నటుడు తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు 2017 లో ప్రకటించారు. తమిళనాడు ఎంతో మంది కళాకారులకు పుట్టిల్లు. అలాంటి వారిలో నటుడి నుంచి ముఖ్యమంత్రి అయిన వారిలో ఎంజీఆర్ దేశంలోనే మొదటి వారు. ఇంకా ఎన్టీఆర్, జయలలిత వంటి వారెందరో సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి విజయవంతం కాగా, మరెందరో ప్రయత్నించి విఫలమయ్యారు. అలాగే కొత్తగా రాజకీయాల్లోకి దిగిన కమల్ హసన్ కూడా విజయవంతం అవుతారో లేదో వేచి చూడాలి. ఆయన 2018 ఫిబ్రవరిలో మక్కల్ నీది మయ్యం పేరిట సొంత పార్టీని ప్రారంభించారు. తన పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రగా పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ ఆయన డీఎంకే, అన్నా డీఎంకేతర పక్షాలతో కూటమిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు డీఎంకేతో సంబంధాలు తెంచుకున్నట్లయితే కాంగ్రెస్తో కలవడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.
సినిమా రంగంలో కమల్ హసన్ జాతీయ అవార్డు, ఫిల్మ్ఫేర్తో పాటు లెక్కలేనన్ని అవార్డులను సాధించారు. భారత దేశం తరపున విదేశీ భాషా విభాగంలో అత్యధిక సంఖ్యలో ఆయన సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం ఎంపిక అయ్యాయి. దేశంలో మరే నటుడికి ఈ గౌరవం దక్కలేదు. నటుడిగానే కాక దర్శకత్వం, రచయిత, స్క్రీన్ రైటింగ్, నృత్య దర్శకుడు వంటి వేరే విభాగాల్లోకి కూడా ఆయన అడుగుపెట్టారు. నాలుగేళ్ల వయసులోనే 1960 లో వచ్చిన "కళత్తూర్ కన్నమ్మ" చిత్రంతో ఆయన బాల నటుడిగా మారారు. ఈ చిత్రంలో నటనకు గాను ఆయనకు రాష్ట్రపతి అవార్డు (ప్రెసిడెంట్ బంగారు పతకం) రావడం విశేషం. ఆ చిత్రంతో మొదలుకుని ఆయన సినిమా ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎన్నో విజయంతమైన చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.