Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీర్తీ ఆజాద్

కీర్తీ ఆజాద్
కీర్తి ఆజాద్ పూర్తి పేరు కీర్తి వర్ధన్ భగవత్ ఝా ఆజాద్. కీర్తీ ఆజాద్‌గానే ఆయన సుపరిచితులు.
By Ajay M V | Monday, February 18, 2019, 02:12:08 PM [IST]

కీర్తీ ఆజాద్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కీర్తి ఆజాద్ పూర్తి పేరు కీర్తి వర్ధన్ భగవత్ ఝా ఆజాద్. కీర్తీ ఆజాద్‌గానే ఆయన సుపరిచితులు. క్రికెటర్‌ మొదలుపెట్టిన ఆయన కెరీర్‌ రాజకీయ నాయకుడిగా మారింది. 1959 జనవరి 2న ఆయన బిహార్‌లోని పూర్ణియాలో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోని ముగిసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని దర్భంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. అంతకుముందు ఢిల్లీలోని గోలే మార్కెట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. క్రికెటర్ గా గుర్తింపు పొందిన ఆజాద్.. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.1980-81 మధ్యకాలంలో భారత జట్టు న్యూజీలాండ్ పర్యటన సందర్భంగా ఆయన క్రికెట్ కేరీర్ ఆరంభమైంది. వెల్లింగ్టన్ లో తన తొలి టెస్ట్ ను ఆడారు. భారత క్రికెట్ జట్టులో ఆయన ఆఫ్ బ్రేక్ బౌలర్.

మరిన్ని చదవండి

కీర్తీ ఆజాద్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు కీర్తీ ఆజాద్
పుట్టిన తేదీ 02 Jan 1959 (వ‌య‌స్సు  67)
పుట్టిన ప్రాంతం పూర్ణియా (బీహార్)
పార్టీ పేరు Indian National Congress
విద్య Graduate
వృత్తి క్రీడాకారుడు, జర్నలిస్ట్, సంఘ సంస్కర్త
తండ్రి పేరు భగవత్ ఝా ఆజాద్
తల్లి పేరు శ్రీమతి ఇందిరా ఝా ఆజాద్
జీవిత భాగస్వామి పేరు శ్రీమతి పూనమ్ ఆజాద్
సంతానం 2 కుమారులు

కీర్తీ ఆజాద్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹2.81 CRORE
ఆస్తులు
₹2.85 CRORE
బాధ్యతలు
₹4.32 LAKHS

కీర్తీ ఆజాద్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

తన ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, క్రీడా ఈవెంట్లు నిర్వహించారు.

కీర్తీ ఆజాద్ రాజకీయ జీవితం

  • 2019: బీజేపీ లోక్ సభ సభ్యుడు కీర్తి ఆజాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని కీర్తి ఆజాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. `రాహుల్ గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను. సంప్రదాయ బద్ధ మిథిల శైలిలో నేను ఆయనను సన్మానిస్తాను..` అని కీర్తి ఆజాద్ తెలిపారు.
  • 2015: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఆరోపణలలో విషయంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉందని ఆరోపించి బీజేపీ నుంచి సస్పెండ్‌కు గురైయ్యాడు.
  • 2015: సబ్ కమిటీ-2కి కన్వీర్‌గా, అంచనా కమిటీలో సభ్యునిగా బాధ్యతలు అందుకుని 2016 ఏప్రిల్ 30వరకూ సేవలందించారు.
  • 2014: 2014 సెప్టెంబరులో గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా చేరారు. కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా, హోం అఫైర్స్, పార్లమెంటరీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకానికి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు అందుకున్నారు.
  • 2014: మరోసారి అదే నియోజకవర్గం (దర్బంగా) నుంచి పోటీ చేసి ఆర్జేడీ నేత మొహ్మద్ అలీ అష్రఫ్ ఫత్మీపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఆగష్టు 4 నుంచి 2016 ఏప్రిల్ 30 వరకూ అంచనా కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు.
  • 2009: మానవ వనరుల అభివృద్ధి స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సభ్యునిగా చేరారు. ఆగష్టు 21వ తేదీన పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్‌లో సభ్యునిగా, పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భద్రత విషయాలు పర్యవేక్షించే జాయింట్ కమిటీలో సభ్యునిగా చేరారు. అంతేగాక, ఖాదీ గ్రామీణ పరిశ్రమలు సహకారం సంఘాల్లో సభ్యునిగా, యూత్ అఫైర్స్ & క్రీడా సలహా కమిటీలో సభ్యునిగా చేరారు.
  • 2009: ఆజాద్ 15వ లొక్ సభకు మరోసారి ఎన్నికయ్యారు. 2009 జూన్ 9 తర్వాత హౌజ్ కమిటీలో సభ్యుడిగా చేరి 2014 మే 18 వరకూ కొనసాగారు.
  • 2004: మరోసారి అదే నియోజకవర్గం (దర్బంగా) నుంచి పోటీ చేసి ఓటమికి గురైయ్యారు. ఆ సమయంలో ఆర్జేడీ నేత మొహ్మద్ అలీ అష్రఫ్ ఫత్మీ 1,43, 463 ఓట్ల తేడాతో కీర్తీ ఆజాద్‌ను ఓడించాడు. .
  • 1999: దర్బంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆర్జేడీ నేత మొహ్మద్ అలీ అష్రఫ్ ఫత్మీని ఓడించడంతో విజయం దక్కింది.
  • 1993: కీర్తి ఆజాద్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించారు. 1998వరకూ ఆయన సేవలను కొనసాగించారు.

గ‌త చ‌రిత్ర

  • 1981: ఫిబ్రవరి 21 నుంచి 25వరకూ జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో వెల్లింగ్‌టన్ వేదికగా టెస్టు మ్యాచ్ అరంగ్రేటం చేశాడు. 1983వ సంవత్సరంలో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్ ఆజాద్ కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్.
  • 1980: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడే టీమిండియాలో అరంగ్రేటం చేశాడు. షార్జా వేదికగా పాకిస్తాన్ జట్టుతో తలపడే టీమిండియాలో ఒకడిగా ఆఖరి మ్యాచ్‌ను పూర్తి చేశాడు.
  • 1976: ఢిల్లీ ఆల్ రౌండర్‌గా బరిలోకి దిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగ్రేటం చేశాడు.

కీర్తీ ఆజాద్ సాధించిన విజయాలు

క్రికెటర్‌గా మంచి పేరు పొందడమే కాకుండా క్రీడలకు టీవీ కామంటేటర్‌గా కూడా వ్యవహరించారు. 1983 ప్రపంచ కప్
విజయం సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఢిల్లీ, నార్త్ జోన్ క్రికెట్ జట్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఏడు టెస్టు మ్యాచ్‌లు, 25 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+