హోం
 » 
ఎమ్ వీర‌ప్ప మొయిలీ

ఎమ్ వీర‌ప్ప మొయిలీ

ఎమ్ వీర‌ప్ప మొయిలీ

మార్పాడి వీర‌ప్ప మొయిలీ క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కులు. ఆయ‌న ప్ర‌స్తుతం చిక్క‌బళ్లాపూర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఉన్నారు.

ఎమ్ వీర‌ప్ప మొయిలీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మార్పాడి వీర‌ప్ప మొయిలీ క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కులు. ఆయ‌న ప్ర‌స్తుతం చిక్క‌బళ్లాపూర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఉన్నారు. వీర‌ప్ప మొయిలీ గతంలో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి గానూ మ‌రియు కేంద్ర పెట్రోలియం మ‌రియు న్యాయ శాఖ మంత్రిగానూ ప‌ని చేశారు. 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో చిక్క‌బ‌ళ్లాపూర్ నుంచి ఎంపీగా అత్య‌ధిక మెజార్టీతో ఆయ‌న గెలుపొందారు. మే 16, 2014 నుంచి ఆయ‌న చిక్క‌బ‌ళ్లాపూర్ నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. మొయిలీ ప్ర‌స్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా మ‌రియు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ ఇంఛార్జీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల‌లో వీర‌ప్ప మొయిలీ ఒక‌రు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అత్యంత స‌న్నిహిత స‌లహాదారుడిగా పేరు గాంచారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

ఎమ్ వీర‌ప్ప మొయిలీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఎమ్ వీర‌ప్ప మొయిలీ
పుట్టిన తేదీ 12 Jan 1940 (వ‌య‌స్సు  84)
పుట్టిన ప్రాంతం మూద్‌బిద్రి, ద‌క్షిణ క‌న్న‌డ జిల్లా, క‌ర్ణాట‌క
పార్టీ పేరు Indian National Congress
విద్య Graduate Professional
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు, ఎంపీ, న్యాయ‌వాది, ర‌చ‌యిత‌, క‌వి
తండ్రి పేరు త‌మ్మ‌య్య
తల్లి పేరు పూవ‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు మాల‌తీ
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి, మ‌హిళా రైతు
సంతానం 1 కుమారులు 3 కుమార్తెలు
శాశ్వత చిరునామా నెం-708, శంక‌ర‌ముత్త రోడ్, చిక్క‌బ‌ళ్లాపూర్‌ టౌన్‌, చిక్క‌బ‌ళ్లాపూర్ జిల్లా
ప్రస్తుత చిరునామా 3, తుగ్గ‌క్ లేన్‌, న్యూ ఢిల్లీ-110011
కాంటాక్ట్ నెంబర్ 9845536333 - 08023430491
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ http://www.moily.org
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

ఎమ్ వీర‌ప్ప మొయిలీ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹9.79 CRORE
ఆస్తులు :₹13.74 CRORE
బాధ్యతలు: ₹3.94 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

ఎమ్ వీర‌ప్ప మొయిలీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ప్ర‌ముఖ ప‌త్రిక‌లు మ‌రియు ఎల‌క్ట్రానిక్ ఛాన‌ళ్ల‌లో రెగ్యుల‌ర్ కాల‌మిస్ట్‌గా ఉన్నారు మరియు అన్‌లీషింగ్ ఇండియా, ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్‌, శ్రీ రామాయ‌ణ మ‌హాన్వేష‌ణ‌మ్ వంటి ఎన్నో పుస్త‌కాల‌ను రాశారు.
భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ, కోశ వ్య‌వ‌స్థ మ‌రియు స్థూల, సూక్ష్మ దృక్ప‌థంలో రాష్ట్రాల ఆర్థిక అవ‌స‌రాల విష‌యాలంటే ఆయ‌నకు ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఉంది.
క్రికెట్ ఆయ‌న‌కిష్ట‌మైన ఆట‌.

ఎమ్ వీర‌ప్ప మొయిలీ రాజకీయ జీవితం

2015
  • జన‌వ‌రి 29, 2015 నుంచి సాధార‌ణ‌ ప్ర‌యోజ‌నాల క‌మిటీలో స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2014
  • 16 వ లోక్‌స‌భ‌కు తిరిగి ( మొత్తంగా రెండ‌వ సారి) ఎన్నిక‌య్యారు. సెప్టెంబ‌రు1, 2014 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా మ‌రియు కాన్సులేటివ్ క‌మిటీ, విదేశీ వ్య‌వ‌హ‌రాలు మ‌రియు ప్ర‌వాస భార‌తీయ వ్య‌వ‌హ‌రాల క‌మిటీల‌లో స‌భ్యుడిగా ఉన్నారు.
2009
  • 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2009 నుంచి 2012 మ‌ధ్య, కేంద్ర న్యాయ, కార్పోరేట్ వ్య‌వ‌హారాలు, ఇంధ‌నం, పెట్రోలియం మ‌రియు స‌హ‌జ‌వాయువు శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు.
1992
  • 1992 నుంచి 1994 మ‌ధ్య క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.
1990
  • 1990 లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో విద్యా శాఖ మంత్రిగా బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు.
1989
  • 1989 లో క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వంలో న్యాయ శాఖా మంత్రిగా సేవ‌లందించారు.
1983
  • క‌ర్ణాటక రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.
1980
  • 1980 నుంచి 83 మ‌ధ్య క‌ర్ణాట‌క రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు.
1975
  • క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో చిన్న ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి అయ్యారు.
1972
  • 1972 నుంచి 1979 మ‌ధ్య కర్ణాట‌క రాష్ట్ర శాస‌న‌స‌భ్యుడిగా(మొత్తం ఆరు సార్లు) ఉన్నారు.

గ‌త చ‌రిత్ర

Early 60's
  • మంగ‌ళూరు న‌గ‌రంలోని హంప‌న‌క‌ట్ట లోని ప్ర‌భుత్వ క‌ళాశాల‌(యూనివ‌ర్సిటీ కాలేజీ) నుంచి బీ.ఏ పూర్తి చేశారు. బెంగళూరులోని యూనివ‌ర్సిటీ లా కాలేజీ నుంచి బీ.ఎల్ ప‌ట్టా పుచ్చుకున్నారు.
Early 40's
  • 5 ఏళ్ల బాలుడిగా త‌ల్లి ఒడిలో కూర్చున్న‌ప్పుడే, భోజ‌నం చేస్తున్న‌ప్పుడు ఇంటి య‌జమాని త‌మ ఇంటి నుంచి బ‌ల‌వంతంగా వెళ్ల‌గొట్ట‌డాన్ని బాగా గ‌మ‌నించార‌ట‌. న్యాయం కోసం పోరాడడానికి ఆ సంఘ‌ట‌నే త‌న‌కు ప్రేర‌ణ‌నిచ్చిందని ఆయ‌న చెబుతుంటారు.

ఎమ్ వీర‌ప్ప మొయిలీ సాధించిన విజయాలు

వివిధ త్రాగునీటి, ఉద్యోగ క‌ల్ప‌నా ప‌థ‌కాలు మ‌రియు గృహ నిర్మాణ ప‌థ‌కాల‌ను రూపొందించి మ‌రియు అమ‌లు చేశారు.
సాగునీటి రంగంలో అద్భుత‌మైన‌, భారీ ప‌నుల‌ను చేప‌ట్టారు మ‌రియు కర్ణాట‌క వ్యాప్తంగా వ్య‌వ‌సాయ రంగ ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డ్డారు.
1992-93, 1993-94, 1994-95, 1980-81, 1981-82 & 1982-83 సంవ‌త్స‌రాల‌లో క‌ర్ణాట‌క రాష్ట్ర బ‌డ్జెట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.
ఆర్థిక మంత్రిగా ఉన్న‌ప్పుడు రికార్డు స్థాయిలో మిగులు రాబ‌డుల‌ను సృష్టించారు.
రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల క‌మీష‌న్ ఛైర్మ‌న్‌గా ఉన్నారు.
2000 లో అమీన్ స‌ద్భావ‌న అవార్డు అందుకున్నారు.
2001 లో దేవ‌రాజ్ అర‌సు ప్ర‌శ‌స్తి అవార్డు గెలుచుకున్నారు.
2001 లో ఆర్య‌భ‌ట్ట అవార్డును అందుకున్నారు.
2002 లో డాక్ట‌ర్ బీ.ఆర్‌. అంబేద్క‌ర్ అవార్డును అందుకున్నారు.
2007 లో మూర్తీదేవి మ‌రియు 2014 లో స‌ర‌స్వతి స‌మ్మాన్ అవార్డుల‌ను అందుకున్నారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X