• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
మ‌న్మోహ‌న్ సింగ్

మ‌న్మోహ‌న్ సింగ్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ప్ర‌ఖ్యాత ఆర్థిక వేత్త‌గా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న మ‌న్మోహ‌న్ సింగ్ దేశానికి రెండుసార్లు పూర్తికాలం ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేశారు. ఈ ఘ‌న‌త అంత‌కుముందు జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పేరిట మాత్ర‌మే ఉండేది. ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాల‌యం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్ట‌రేట్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ మొద‌ట‌ ఐక్య‌రాజ్య స‌మితిలో ప‌ని చేశారు, అనంత‌రం మ‌న దేశ ప్ర‌భుత్వంలో వివిధ కీల‌క హోదాల‌లో సేవ‌లందించారు. 1991 లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు చేపట్టిన సంస్క‌ర‌ణ‌లు ఆయ‌న‌కు ఎన‌లేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఆర్థిక‌మంత్రిగా ఆయ‌న చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో పెను సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ మ‌న దేశం తిరిగి గాడిలో ప‌డి, ప్ర‌పంచంలోనే అధిక వృద్ధి రేటు గ‌ల దేశంగా మారింది. 1991 లో తొలిసారి రాజ్య‌స‌భకు ఎన్నికైంది మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న నాలుగుసార్లు ఎగువ‌స‌భ స‌భ్యుడిగా సేవ‌లందించారు. 2004 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మి విజ‌యం సాధించింది. ప్ర‌ధాని ప‌ద‌వికి సోనియా గాంధీ విముఖ‌త చూప‌డంతో ఆయ‌న ప్ర‌ధానమంత్రి అయ్యారు. 2009 లో కూడా ఆయ‌న దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌తలను స్వీక‌రించారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మ‌న్మోహ‌న్ సింగ్
పుట్టిన తేదీ 26 Sep 2019 (వ‌య‌స్సు  1)
పుట్టిన ప్రాంతం గ్రామం. గాహ్‌, ప‌శ్చిమ పంజాబ్
పార్టీ పేరు Indian National Congress
విద్య
వృత్తి సివిల్ స‌ర్వీసు అధికారి, ఆర్థికవేత్త‌, రాజ‌కీయ, సామాజిక కార్య‌క‌ర్త‌, ఉపాధ్యాయుడు మరియు విద్యావేత్త
తండ్రి పేరు గుర్ముఖ్ సింగ్
తల్లి పేరు అమృత్ కౌర్
జీవిత భాగస్వామి పేరు గురు శరణ్ కౌర్
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 3 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఇంటి నెం. 3989, నంద‌న్ న‌గ‌ర్‌, వార్డు నెం. 51, సారుమంత‌రియా, డిస్పూర్, గువ‌హ‌టి, జిల్లా. కామ‌రూప్‌, అస్సాం - 781006
ప్రస్తుత చిరునామా బంగ్లా నెం. 3, మోతీలాల్ నెహ్రు ప్లేస్‌, న్యూ ఢిల్లీ
కాంటాక్ట్ నెంబర్ 23018668, 23015470, 23794817
ఈ-మెయిల్ manmohan@sansad.nic.in

ఆసక్తికర అంశాలు

మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలో కాశ్మీర్‌లో శాంతి నెల‌కొన‌క‌పోగా, దేశ ఈశాన్య ప్రాంతంలో తీవ్ర‌వాదాన్ని మాత్రం అణ‌చివేయ‌గ‌లిగారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2013
    రాజ్య‌స‌భ‌కు అయిదోసారి ఎన్నిక‌య్యారు.
  • 2007
    రాజ్య‌స‌భ‌కు నాలుగోసారి ఎన్నిక‌య్యారు.
  • 2004
    2004 నుంచి 2014 మ‌ధ్య రెండుసార్లు దేశ ప్ర‌ధానిగా సేవ‌లందించారు.
  • 2001
    మ‌న్మోహ‌న్ సింగ్ మూడో సారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 1999
    13 వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న ద‌క్షిణ ఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి విజ‌య్ కుమార్ మ‌ల్హోత్రా చేతిలో ఓడిపోయారు.
  • 1998
    రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.
  • 1998
    ఆర్థిక క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 1996
    ఆర్థిక మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 1995
    రాజ్య‌స‌భ‌కు రెండోసారి ఎన్నిక‌య్యారు.
  • 1991
    రాజ్య‌స‌భ‌కు ఎన్నికై, అనంత‌రం దేశ ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 1991
    ఐ.ఎం.ఎఫ్, ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ రీక‌న‌స్ట్ర‌క్ష‌న్ అండ్ డెవ‌లప్‌మెంట్ బోర్డు ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్‌లో మ‌న దేశం త‌ర‌పున గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేశారు.
  • 1990
    ఆర్థిక వ్య‌వ‌హ‌రాల‌పై ప్ర‌ధాన మంత్రికి స‌ల‌హాదారుడిగా సేవ‌లందించారు.
  • 1987
    జెనీవా లోని సౌత్ క‌మిష‌న్‌లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితోపాటు క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.
  • 1985
    ఇండియ‌న్ ఎక‌నామిక్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 1985
    ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 1983
    ప్ర‌ధాన‌మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లిలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 1982
    రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ అయ్యారు.
  • 1982
    ఐ.ఎం.ఎఫ్ బోర్డు ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్‌లో మ‌న దేశ‌పు ప్రత్యామ్నాయ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.
  • 1980
    ప్ర‌ణాళిక సంఘంలో స‌భ్య కార్య‌ద‌ర్శిగా సేవ‌లందించారు.
  • 1980
    ఇండో-జ‌పాన్ సంయుక్త అధ్య‌య‌న క‌మిటీకి చెందిన భార‌త క‌మిటీకి ఛైర్మ‌న్‌గా ప‌ని చేశారు.
  • 1976
    ఆర్థిక మంత్రిత్వ శాఖ‌(ఆర్థిక వ్య‌వ‌హ‌రాలు) కార్య‌ద‌ర్శిగా, ఆర్థిక అణు విద్యుత్తు క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 1972
    కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ ముఖ్య ఆర్థిక స‌ల‌హ‌దారుడిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 1971
    దేశ విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ‌ ఆర్థిక స‌ల‌హాదారుడిగా ప‌ని చేశారు.

గ‌త చ‌రిత్ర

  • 1966
    ఆయ‌న ఐక్య‌రాజ్య స‌మితిలో ప‌ని చేశారు.
నికర ఆస్తులుN/A
ఆస్తులు N/A
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X