నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు వృత్తిరీత్యా క్రికెటర్ మరియు పంజాబ్ రాష్ట్ర పర్యాటక, సాంసృతిక వ్యవహారాలు మరియు మ్యూజియంల మంత్రి. 2004 సార్వత్రిక ఎన్నికలలో ఆయన బీజేపీ టికెట్‌పై అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒక మారణకాండ కేసులో ఆరోపణలు రావడంతో 2006 లో ఆయన తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009 సాధారణ ఎన్నికలలో ఆయన కాంగ్రెస్‌కి చెందిన సురీందర్ సింగ్లాపై 77,626 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
2014 సాధారణ ఎన్నికలలో ఆయన పోటీ చేయలేదు. ఆ ఏడాది ఏప్రిల్‌లో మోదీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. కానీ అదే ఏడాది జూలై 18 న ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సెప్టెంబరు, 2016 లో ఆయన బీజేపీ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. 2017 జనవరిలో అవాజ్-ఇ-పంజాబ్ పేరిట పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, 42,809 ఓట్ల తేడాతో గెలిచారు.
| పూర్తి పేరు | నవజ్యోత్ సింగ్ సిద్ధు |
| పుట్టిన తేదీ | 20 Oct 1963 (వయస్సు 62) |
| పుట్టిన ప్రాంతం | పాటియాలా, పంజాబ్ |
| పార్టీ పేరు | Indian National Congress |
| విద్య | Graduate Professional |
| వృత్తి | క్రికెటర్, కామేంటేటర్ మరియు రాజకీయ నాయకుడు |
| తండ్రి పేరు | సర్ధార్ భగవంత్ సింగ్ |
| తల్లి పేరు | నిర్మల్ సిద్ధు |
| జీవిత భాగస్వామి పేరు | నవజ్యోత్ కౌర్ సిద్ధు |
| జీవిత భాగస్వామి వృత్తి | డాక్టర్ / రాజకీయ నాయకురాలు |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
| మతం | సిక్కు |
| వెబ్‌సైట్ | sherryontopp.com |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.