హోం
 » 
పీయూష్ గోయ‌ల్

పీయూష్ గోయ‌ల్

పీయూష్ గోయ‌ల్

వృత్తిరీత్యా ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన పీయూష్ గోయ‌ల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో ప‌ని చేశారు. బీజేపీతో సుదీర్ఘ‌కాలం అనుబంధం కొన‌సాగించారు.

పీయూష్ గోయ‌ల్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

వృత్తిరీత్యా ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన పీయూష్ గోయ‌ల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో ప‌ని చేశారు. బీజేపీతో సుదీర్ఘ‌కాలం అనుబంధం కొన‌సాగించారు. ఎన్నో ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల ప్ర‌చారంలో పాల్గొన్నారు. 2010, 2016 లో ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన మొద‌టి సారి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో మంత్రిత్వ శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. గోయ‌ల్ ప్ర‌స్తుతం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా ఉన్నారు.

మరిన్ని చదవండి
By Moumi Majumdar Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

పీయూష్ గోయ‌ల్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు పీయూష్ గోయ‌ల్
పుట్టిన తేదీ 13 Jun 1964 (వ‌య‌స్సు  59)
పుట్టిన ప్రాంతం ముంబ‌యి, మ‌హారాష్ట్ర‌
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య
వృత్తి ఛార్టెడ్ అకౌంటెంట్, మేనేజ్‌మెంట్ కన్స‌ల్టెంట్
తండ్రి పేరు దివంగ‌త శ్రీ వేద్‌ప్ర‌కాష్ గోయ‌ల్
తల్లి పేరు చంద్రకాంత గోయ‌ల్
మతం హిందూ
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

పీయూష్ గోయ‌ల్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹83.91 CRORE
ఆస్తులు :₹95.38 CRORE
బాధ్యతలు: ₹11.47 CRORE

పీయూష్ గోయ‌ల్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

పీయూష్ గోయ‌ల్ రాజ‌కీయ నాయ‌కుల కుటుంబం నుంచి వ‌చ్చారు. ఆయ‌న త‌ల్లి దివంగ‌త చంద్రకాంత గోయ‌ల్ మ‌హారాష్ట్ర‌లో మూడుసార్లు ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు. తండ్రి దివంగ‌త వేద్‌ ప్ర‌కాష్ గోయ‌ల్ గతంలో అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ప్ర‌భుత్వంలో నౌకాయాన మంత్రిగా ప‌ని చేశారు.

పీయూష్ గోయ‌ల్ రాజకీయ జీవితం

2019
  • కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
2018
  • కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల మంత్రి అయ్యారు.
2017
  • కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ‌ల మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
2016
  • రెండోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
2016
  • కేంద్ర గ‌నుల శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా) అయ్యారు.
2014
  • బొగ్గు శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా), నూత‌న, పున‌ర్వినియోగ ఇంధ‌న వ‌న‌రుల శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా)గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.
2014
  • మైనారిటీ వ్య‌వ‌హ‌రాల మంత్రిత్వ శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా) మ‌రియు విద్యుత్తు శాఖ మంత్రి అయ్యారు.
2010
  • ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2010
  • రాజ్య‌స‌భకు ఎన్నికై, ఆర్థిక క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2010
  • భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కోశాధికారి అయ్యారు.
1991
  • బీజేపీ చేపట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌చారం చేప‌ట్టారు.

పీయూష్ గోయ‌ల్ సాధించిన విజయాలు

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో డైరెక్ట‌ర్‌ (ప్ర‌భుత్వ నామినీ)గా నియ‌మితుల‌య్యారు. దీంతోపాటు 2002-04 మ‌ధ్య‌లో న‌దుల అనుసంధానానికి ఉద్దేశించిన కార్య‌ద‌ళంలో స‌భ్యుడిగా, 2004 నుంచి 08 మ‌ధ్య కాలంలో ఎస్‌బీఐ డైరెక్ట‌ర్‌గా (ప్ర‌భుత్వ నామినీ) నియ‌మితుల‌య్యారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X