ప్రమోద్ సావంత్ ఉత్తర గోవాలోని సాంక్వెలిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. గోవా రాజకీయాల్లో సౌమ్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ప్రమోద్ సావంత్ ఉత్తర గోవాలోని సాంక్వెలిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. గోవా రాజకీయాల్లో సౌమ్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా సాంక్వెలిమ్ నుంచి ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా గెలవడం విశేషం. గోవా ముఖ్యమంత్రిగా పని చేసిన దివంగత మనోహర్ పారికర్‌కు అనుంగు అనుచరుడిగా సావంత్ వ్యవహరించారు. అందుకే రాష్ట్ర మంత్రివర్గంలో పని చేసిన అనుభవం లేనప్పటికీ, స్పీకర్‌గా ఆయన పేరును పారికర్ ప్రతిపాదించారు.
వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడు కూడా. మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో గల గంగా ఆయుర్వేదిక్ కాలేజీ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మరియు తిలక్ మహరాష్ట్ర విద్యాపీఠ్ నుంచి సామాజిక సంక్షేమం(సోషల్ వెల్ఫేర్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మనోహర్ పారికర్ ఏర్పాటు చేసిన గోవా రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గానూ ఆయన పని చేశారు. మనోహర్ పారికర్ మరణానంతరం మార్చి 18, 2019 నాడు ఆయన గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పూర్తి పేరు | డాక్టర్ ప్రమోద్ పీ సావంత్ |
పుట్టిన తేదీ | 24 Apr 1973 (వయస్సు 51) |
పుట్టిన ప్రాంతం | N/A |
పార్టీ పేరు | Bharatiya Janta Party |
విద్య | Post Graduate |
వృత్తి | వ్యవసాయం/వ్యాపారం/ఆయుర్వేద ప్రాక్టీషనర్ |
తండ్రి పేరు | పాండురంగ్ సావంత్ |
తల్లి పేరు | పద్మినీ సావంత్ |
మతం | హిందూ |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.