హోం
 » 
ఆర్‌.కె,రోజా

ఆర్‌.కె,రోజా

ఆర్‌.కె,రోజా

తిరుప‌తిలో 1972లో రోజా జ‌న్మించారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో పేరున్న న‌టిగా గుర్తింపు పొందారు.

ఆర్‌.కె,రోజా బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

తిరుప‌తిలో 1972లో రోజా జ‌న్మించారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో పేరున్న న‌టిగా గుర్తింపు పొందారు. తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి విశ్వ‌విద్యాల‌యంలో డిగ్రీ పూర్తి చేశాక ఆమె కూచిపూడి నేర్చుకున్నారు. ఆమె తొలి హిట్ సినిమా ప్రేమ త‌ప‌స్సు. ఇందులో ఆమె ప్ర‌ముఖ న‌టుడైన రాజేంద్ర ప్ర‌సాద్ స‌ర‌స‌న న‌టించారు. చిత్రం షూటింగంతా ఆమె జ‌న్మ స్త‌ల‌మైన తిరుప‌తిలోనే తీయ‌డం విశేషం. ఆ త‌ర్వాత ఆమెను త‌మిళ చిత్రసీమ‌కు ప‌రిచయం చేసింది మాత్రం ద‌ర్మ‌కుడు ఆర్‌.కె. సెళ్వ‌మ‌ణి. ఆయ‌నే రోజా భ‌ర్త‌. ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది తెలుగు దేశం పార్టీతో. 2004, 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ పార్టీలో అదే నియ‌జ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున పోటీ చేసి తొలి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె వైఎస్సార్ పార్టీ మ‌హిళ వింగ్‌కు అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హరిస్తున్నారు.

మరిన్ని చదవండి
By Moumi Majumdar Updated: Monday, October 29, 2018, 01:47:52 PM [IST]

ఆర్‌.కె,రోజా వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఆర్‌.కె,రోజా
పుట్టిన తేదీ 17 Nov 1972 (వ‌య‌స్సు  51)
పుట్టిన ప్రాంతం తిరుప‌తి
పార్టీ పేరు Yuvajana Sramika Rythu Congress Party
విద్య 12th Pass
వృత్తి న‌టి, రాజ‌కీయ‌వేత్త‌, టీవీ వ్యాఖ్యాత‌, చిత్ర నిర్మాత‌
తండ్రి పేరు నాగ‌రాజ రెడ్డి
తల్లి పేరు ల‌లిత‌
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

ఆర్‌.కె,రోజా నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹8.62 CRORE
ఆస్తులు :₹9.33 CRORE
బాధ్యతలు: ₹71.85 LAKHS

ఆర్‌.కె,రోజా సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం ఈ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో క‌లుపుకొని ఆమె 100కు పైనే సినిమాల్లో న‌టించారు.

ఆర్‌.కె,రోజా రాజకీయ జీవితం

2014
  • ఈ సారి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి 858 ఓట్ల తేడాతో ప్ర‌త్య‌ర్థి పైన గెలుపొందారు.
2009
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌.
2009
  • మ‌ళ్లీ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ, ఓట‌మి.
2004
  • న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ. కాంగ్రెస్ అభ్య‌ర్థి అయిన చెంగారెడ్డి రెడ్డివారి చేతిలో ఓట‌మి.
1999
  • తెలుగు దేశం పార్టీలో చేరిక‌. తెలుగు మ‌హిళా వింగ్‌కు అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌.

గ‌త చ‌రిత్ర

1997
  • తొలి మ‌ళ‌యాల చిత్రం గంగోత్రిలో న‌టించారు.
1993
  • గడిబిడి గండ అనే క‌న్న‌డ చిత్రంలో న‌టించారు.
1992
  • చెంబ‌రూతి అనే చిత్రంతో త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోకి ఆరంగేట్రం.
1991
  • ప్రేమ త‌పస్సు సినిమాతో తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనికి ఆరంగేట్రం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం తిరుప‌తిలో సాగ‌డం విశేషం.

ఆర్‌.కె,రోజా సాధించిన విజయాలు

న‌టిగా ఆమెకు నంది బ‌హుమ‌తితో పాటు త‌మిళ‌నాడులోనూ న‌టుల‌కు ఇచ్చే ఉన్న‌త పుర‌స్కారం ల‌భించింది. అంతేకాదు మా టీవీ త‌ర‌ఫున ఉత్త‌మ టీవీ యాంక‌ర్‌గా బ‌హుమ‌తి ల‌భించింది.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X