• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ఉమా భార‌తీ

ఉమా భార‌తీ

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఉమా భార‌తీ ప్ర‌స్తుతం కేంద్ర త్రాగునీరు మ‌రియు పారిశుద్ధ్య శాఖా మంత్రిగా ఉన్నారు. ఆమెకు ఘ‌న‌మైన రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే ధోర‌ణికి ఆమె ప్ర‌సిద్ధి చెందారు. ఏ విష‌యాన్నైనా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డం ఆమె నైజం. చిన్న వ‌య‌సులోనే బీజేపీలో చేరిన ఆమె అన‌తికాలంలోనే ఆ పార్టీ ప్ర‌ధాన ప్ర‌చార‌క‌ర్త‌గా ఎదిగారు. ఒక ఏడాది పాటు స్వ‌ల్ప‌కాలం మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆమె, 1994 హుబ్లీ అల్ల‌ర్ల కేసులో అరెస్టు వారెంటు జారీ కావ‌డంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆమె ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఝాన్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా ఉన్నారు. ఆర్ఆర్ఎస్‌కు ఆమె గ‌ట్టి మ‌ద్ధ‌తుదారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఉమా భార‌తీ
పుట్టిన తేదీ 03 May 1959 (వ‌య‌స్సు  62)
పుట్టిన ప్రాంతం దుండా, జిల్లా. టికామ్‌ఘ‌ర్‌, మధ్య ప్ర‌దేశ్
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య 5th Pass
వృత్తి వ్య‌వ‌సాయ‌దారుడు
తండ్రి పేరు దివంగ‌త శ్రీ గులాబ్ సింగ్
తల్లి పేరు NA

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఆర్/ఓ ఇంటి.నెం. 106, ఎమ్మేల్యే రెసిడెంట్, రాజేంద్ర న‌గ‌ర్‌, తెహిసిల్ & జిల్లా, ల‌క్నో, యూపీ
ప్రస్తుత చిరునామా 6, అక్బ‌ర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
కాంటాక్ట్ నెంబర్ 09953813664
ఈ-మెయిల్ umashribharti@gmail.com

ఆసక్తికర అంశాలు

2011 న‌వంబ‌రులో భార‌త ప్ర‌భుత్వం రిటైల్ రంగంలోకి 51 శాతం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల‌(ఎఫ్‌డీఐ) ల‌ను అనుమ‌తించింది. దీంతో ఆర్సాన్‌తో క‌లిసి వాల్‌మార్ట్ దేశంలోకి ప్రవేశించ‌డాన్ని ఆమె తీవ్రంగా వ్య‌తిరేకించారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014
    ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఝాన్సీ నుంచి నెగ్గి, ఆమె 16 వ లోక్‌స‌భ‌లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన చంద్ర‌పాల్ యాద‌వ్‌పై 1,90,467 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు.
  • 2011
    బీజేపీలోకి ఆమె మ‌ళ్లీ పున‌రాగ‌మ‌నం చేశారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల్సిందిగా ఆమెకు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.
  • 2004
    రాజీనామా త‌ర్వాత ఆమె బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. బీజేపీ నాయ‌కత్వంతో విభేధించి ఆమె భార‌తీయ జ‌న‌శ‌క్తి పేరిట కొత్త పార్టీని ప్రారంభించిన‌ప్ప‌టికీ, అది అంత విజ‌యవంతం కాలేక‌పోయింది.
  • 2003
    మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఆమె స్వ‌ల్ప‌కాలం పాటు ప‌ని చేశారు. అయితే 1994 హుబ్లీ అల్ల‌ర్ల కేసులో అరెస్టు వారెంటు జారీ కావ‌డంతో ఏడాది త‌ర్వాత‌ త‌న ప‌ద‌వికి ఆమె రాజీనామా చేశారు.
  • 1999
    1999 లో ఆమె భోపాల్ నియోజ‌క‌వ‌ర్గ బ‌రిలోకి దిగి, కాంగ్రెస్ అభ్య‌ర్థి సురేష్ ప‌చోరీపై 1,68,864 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
  • 1989
    మ‌రోసారి ఖ‌జుర‌హో నుంచి బ‌రిలోకి దిగిన ఉమా భార‌తీ ఈ సారి ఉదృతంగా ప్ర‌చారం చేప‌ట్టి, త‌న పాత ప్ర‌త్య‌ర్థి చతుర్వేది పై 1,93,345 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంత‌రం 1989 నుంచి 98 వ‌ర‌కు ఆమె వ‌రుస‌గా నాలుగు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నెగ్గి త‌న సీటును నిల‌బెట్టుకున్నారు.
  • 1984
    మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌జుర‌హో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె తొలిసారిగా లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఆమె తన ప్ర‌త్య‌ర్థి చ‌తుర్వేది విద్యావ‌తి చేతిలో, 50,826 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
నికర ఆస్తులు1.44 CRORE
ఆస్తులు 1.44 CRORE
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X