కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్న అచ్చెన్నాయుడు తనకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉంది కాబట్టి సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు. ఈ రోజు ఈ కేసులో అందుకున్న నోటీసులకు కాశిబుగ్గ డీఎస్పీ ఎదుట హాజరైన అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు . భవిష్యత్తులో కూడా విచారణకు సహకరిస్తానని పేర్కొన్న అచ్చెన్నాయుడు తాను ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్టులో కానీ తన పేరు లేదన్న అచ్చెన్న

ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్టులో కానీ తన పేరు లేదన్న అచ్చెన్న

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పోలీసులు, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఆయన తనకు 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్టులో కానీ తన పేరు లేదని స్పష్టం చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాలను తొలగించిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డీఎస్పీ సమక్షంలో సీఐ గునపంతో పొడిచి విగ్రహాన్ని తొలగిస్తున్న వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న ఆయన వాటిని హైకోర్టుకు అందజేస్తానని స్పష్టం చేశారు.

 డిజిపి ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటు

డిజిపి ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటు

తనతో పాటు చాలా మంది టీడీపీ నేతల పేర్లను ఈ కేసులో చేర్చారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు . రాష్ట్ర పోలీసు వ్యవస్థ అవహేళనకు గురవుతోంది అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డిజిపి ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటని పేర్కొన్న అచ్చెన్న ఒక పౌరుడిగా పోలీసు వ్యవస్థ తీరు చూసి సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. సీఎం ఏది చెబితే దానిని పోలీసులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పదే పదే కోర్టు మెట్లు ఎక్కడం ఆయన పెట్టుకున్న స్టార్స్ కు, ఖాకీ డ్రెస్సుకు సిగ్గుచేటు అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తున్నారు

ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తున్నారు

ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తున్నారు అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు గౌతమ్ సవాంగ్ పోలీసులను దద్దమ్మలుగా తయారు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ అవహేళనకు గురవుతుందని పేర్కొన్న అచ్చెన్నాయుడు కావాలని నంది విగ్రహం తరలింపు విషయంలో తనపై దుష్ప్రచారం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+