• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్టార్ హోటల్‌లో రూం.. రాసలీలలకు కాదు, ఆ టైం లేదు, మీకు సిగ్గు మానం లేదు: మాజీ సీఎం ఫైర్

|

బెంగళూరు: ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా బీజేపీ నాయకుల మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హెచ్.డీ. కుమారస్వామి విరుచుకుపడుతున్నారు. ఔను... నేను స్టార్ హోటల్ లో ఉన్నాను. అయితే మీలాగా రూంలో రాసలీలలు చెయ్యడానికి మాత్రం కాదులే, మాకు వేరు పనులుంటాయి అంటూ మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి బీజేపీ నాయకులకు చురకలు అంటించారు. హోటల్ లో రాసలీలలు చెయ్యడానికి మీరు గదులు బుక్ చేసుకుంటారు, మేము మాత్రం అందుకు రూం బుక్ చేసుకోలేము అంటూ మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యేల రాసలీలల వీడియో వైరల్ అయ్యిందని, తనకు అలంటి పాడు బుద్దులు లేవని మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డాడు. మీకంటే సిగ్గు మానం లేదు, మాకు లేదా అని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

 మీరు అందులో కింగ్ లు

మీరు అందులో కింగ్ లు

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే అరవింద లింబావలి గురించి మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి ఆయన చాల గొప్ప వ్యక్తి అన్నారు. అరవింద లింబావలి చేసిన ఘనకార్యాల వీడియోలు బయటకు రాకుండా వాటిని సీజ్ చేయించిన ఘనత ఆయనదే అని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఇలాంటి రాజకీయ నాయకులు తన మీద ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆరోపణలకు సరైన సమాధానం చెబుతున్నానని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

 బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో వైరల్

బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో వైరల్

కర్ణాటక బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాసలీలల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, ఈ కేసులో ప్రముఖ కింగ్ పిన్ అయిన రాఘవేంద్ర అనే యువకుడిని పోలీసులు ఇప్పుడు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అన్నారు. మీలాగా హోటల్ రూంలో రాసలీలలు సాగించే అలవాటు తనకు లేదని, ఆ జీవితం తనకు వద్దని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి బీజేపీ నాయకులకు చురకలు అంటించారు.

 హోటల్ లో రూం ఎందుకంటే !

హోటల్ లో రూం ఎందుకంటే !

అనర్హత ఎమ్మెల్యే విశ్వనాథ్ చేసిన ఆరోపణలపై మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు. తాను ప్రభుత్వ బంగ్లాల్లో నివాసం ఉండలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తన సొంత ఇల్లు జేపీ నగర్ లో ఉందని, తన ఇల్లు విధాన సౌధకు దూరంగా ఉండటం వలనే మద్యాహ్నం భోజనం చెయ్యడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తాను ప్రైవేట్ హోటల్ లో ఉండవలసి వచ్చిందని మాజీ సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు.

 రాత్రి హోటల్ లో ఏం పని ?

రాత్రి హోటల్ లో ఏం పని ?

తాను విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే హోటల్ గది తీసుకున్నానని, రాత్రి అక్కడ రాసలీతలు సాగించడానికి మాత్రం కాదని మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. హోటల్ లో రాసలీలలు సాగించడానికి మీకంటే సిగ్గు మానం లేదు, మాకు సిగ్గు మానం, మర్యాదా లేదా ? అందుకే అలాంటి వాటికి తాము దూరంగా ఉంటున్నామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

 వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం

వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం

తన మీద ఆరోపణలు చేసిన విశ్వనాథ్ ఎన్నోసార్లు జేపీ నగర్ లోని తన ఇంటికి వచ్చి తనతో పాటు భోజనం చేశాడని, అయితే ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యాలని ఏరోజు అతను మా ఇంటికి రాలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. కేఎస్ ఆర్ టీసీలోని పనికిరాని వస్తువులు ( SCRAP) కాంట్రాక్ట్ తన స్నేహితుడికి ఇవ్వాలని, ఇప్పుడే KSRTC ఎండీతో మాట్లాడాలని, నాకు కొంచెం డబ్బులు మిగులుతాయని విశ్వనాథ్ తన ఇంటికి వచ్చి వేడుకున్నాడని, ఇలాంటి పనికిమాలిన పనుల కోసం తన ఇంటికి రావద్దని ఆరోజు ఆయనకు తాను వార్నింగ్ ఇచ్చానని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

 స్టార్ హోటల్ సీఎం !

స్టార్ హోటల్ సీఎం !

హెచ్.డీ. కుమారస్వామి సీఎంగా ఉన్న సమమంలో ఫైవ్ స్టార్ హోటల్ లో ఎక్కువ సమయం గడిపారని, తాను ఎన్నోసార్లు సీఎంను కలవడానికి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ కు వెళ్లిన సమయంలో తరువాత రండి, రేపు రండి అంటూ సమాధానం ఇచ్చారని, సామాన్య ప్రజలను దగ్గరకు రానివ్వకుండా ఆయన విలాసవంతమైన జీవితం గడిపారని ఇటీవల మాజీ మంత్రి విశ్వనాథ్ మాజీ సీఎం కుమారస్వామి మీద సంచలన ఆరోపణలు చేశారు. విశ్వనాథ్ ఆరోపణలకు మాజీ సీఎం కుమారస్వామి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.

English summary
Bengaluru: Distance Is Far From My Residence To Vidhana Soudha Office, That's Why I Am In Hotel: HDK Clarification To H Vishwanath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more