బిగ్ బాస్ టైటిల్ అతనికే ఇవ్వాలన్న యాంకర్ రవి; ఆ వ్యాఖ్యలపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు!!
టెలివిజన్ చరిత్రలో పాపులరైన తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్ యాంకర్ రవి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చెయ్యటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్, బుల్లితెరలో సుపరిచితుడు, ప్రముఖ యాంకర్ రవి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

సైబర్ క్రైం పోలీసుల ముందు యాంకర్ రవి
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉన్న రవి ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రవి ఎలిమినేషన్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. రవి బయటకు రావడంపై ఆయన అభిమానులు రవికి అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొంతకాలంపాటు హాలిడేస్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన రవి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు.

సోహల్ మీడియాలో తన ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు
తనపై,తన కుటుంబ సభ్యుల పై కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని యాంకర్ రవి హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన కుటుంబంపై పెడుతున్న అనుచిత కామెంట్లపై ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునే వాడిని కాదని కానీ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్న రవి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి బ్యాడ్ కామెంట్ కు సమాధానం చెప్పి తీరాల్సిందేనని అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఇన్ని రోజులకు యాంకర్ రవి ఫిర్యాదు
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ఉన్న రవిపై సోషల్ మీడియా వేదికగా అనేక ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లో రవి తీరును పలువురు తప్పుబట్టారు. రవి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవి చేసిన తప్పులను వీడియోలు చేసి మరీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి రవి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ టైటిల్ అతనికే దక్కాలని యాంకర్ రవి ప్రచారం..
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్టుల కోసం ప్రచారం చేస్తున్న రవి తాజాగా సింగర్ శ్రీరామ్ కోసం ఆటోవాలాగా మారి ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రవి బిగ్ బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కడు అని, అది శ్రీ రామచంద్ర మాత్రమే అని అతనికి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాదు శ్రీ రామచంద్రను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ శ్రీ రామచంద్ర పోస్టర్స్ ఉన్న ఆటోను నడిపిన రవి శ్రీ రామచంద్ర కోసం ప్రచారం చేస్తున్నాడు. నువ్వు లోపల ఉండి ఆడు, నీకోసం నేను బయట నుంచి ఆడతా అన్న మాటను రవి నిజం చేస్తున్నాడని పలువురు చెబుతున్నారు. ఇక సింగర్ శ్రీరామచంద్ర అభిమానులు శ్రీరామ్ కోసం రవి ప్రచారం చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications