మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి సతీమణి ఓటమి .. అయినా పంతం నెగ్గించుకున్న జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం నాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల విజయం సాధించి, తన పట్టును నిలుపుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురైనప్పటికీ కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరగడం కాంగ్రెస్ పార్టీ నేతలకు కాస్త ఊరటనిచ్చింది. ఇక ముఖ్యంగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి ఓటమిపాలైంది. అయినప్పటికీ జగ్గారెడ్డి మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నాడు అన్నది పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.

పంతం నెగ్గించుకున్న జగ్గారెడ్డి ... అన్ని ఓట్లు వస్తాయని చాలెంజ్

పంతం నెగ్గించుకున్న జగ్గారెడ్డి ... అన్ని ఓట్లు వస్తాయని చాలెంజ్


ఇంతకీ జగ్గారెడ్డి పంతం ఏంటి? ఆయన ఎలా తన పంతం నెగ్గించుకున్నాడు అన్న వివరాల్లోకి వెళితే మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున యాదవ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పోటీ చేశారు. తన భార్యకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చే ముందు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ సవాల్ చేశారు.

భార్య కోసం కష్టపడిన జగ్గారెడ్డి

భార్య కోసం కష్టపడిన జగ్గారెడ్డి

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తికట్టించే జగ్గారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సరైన బలం లేక ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని భావించిన సమయంలో మెదక్ నుండి జగ్గారెడ్డి సతీమణి, ఖమ్మం నుండి రాయల్ నాగేశ్వర్ రావు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపారు. ఇక భార్య నిర్మలా జగ్గారెడ్డి కోసం జగ్గారెడ్డి చాలా కష్టపడ్డారు.

 230 ఓట్ల కంటే తక్కువ వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, కానీ 238 ఓట్లు

230 ఓట్ల కంటే తక్కువ వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, కానీ 238 ఓట్లు

ఈ క్రమంలో జగ్గారెడ్డి ఎన్నికల బరిలోకి దిగిన తన భార్యకోసం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ఓట్లు పడేలా చేశారు. జగ్గారెడ్డి పంతం 230 ఓట్ల కంటే తక్కువ వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి కి 238 ఓట్లు వచ్చాయి. దీంతో జగ్గారెడ్డి సవాల్ చేసినట్లుగా అన్న మాట నిలబెట్టుకుని భార్యకు 238 ఓట్లు వచ్చేలా చేశారని, ఓటమిపాలైన అప్పటికీ పంతాన్ని నెగ్గించుకున్నారు అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

ఓటమి పాలైన జగ్గారెడ్డి సతీమణి .. అయినా సరే పంతం నెగ్గిన జగ్గారెడ్డి

ఓటమి పాలైన జగ్గారెడ్డి సతీమణి .. అయినా సరే పంతం నెగ్గిన జగ్గారెడ్డి

మొదట అభ్యర్థిని నిలబెట్టడం విషయంలోనే తర్జనభర్జన పడిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజా ప్రతినిధుల కంటే ఎక్కువ ఓట్లు పోల్ కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక తన సతీమణిని బరిలోకి దింపిన మెదక్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన పంతాన్ని నెగ్గించుకోగా, మెదక్ ఎమ్మెల్సీ స్థానాన్ని టిఆర్ఎస్ నుండి బరిలోకి దిగిన యాదవ రెడ్డి దక్కించుకున్నారు. ఒక్క యాదవ రెడ్డి మాత్రమే మొత్తం స్థానాలు టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

English summary
Before giving his wife an MLC ticket, Jaggareddy challenged that he resign as MLA if she gets less than 230 votes. She get 238 votes. With this, even if she lost the election, jaggareddy bet seemed to have won.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X