పిల్లల ముందే భార్య హత్య: చేయికోసుకొన్న భర్త, ఏడ్చిన పోలీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భార్యపై అనుమానంతో ఓ భర్త పిల్లల ముందే భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దారుణం: తండ్రిని అడ్డుపెట్టి కూతురిపై అత్యాచారం, నగ్న ఫోటోలు, వీడియోలతో ఇలా..

భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు అయితే భార్య ఎంత బతిమాలినా కానీ, భర్త మాత్రం వినిపించుకోలేదు. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు.

శాడిస్ట్ మొగుడు: 'ఆ విషయం లీక్ చేసిందనే శైలజపై దాడి'

అంతేకాదు చిన్న పిల్లల ముందే ఈ ఘటనకు పాల్పడ్డాడు. పిల్లలు భయంతో తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు హీరాలాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివాహేతర సంబంధం: కూతురికి చిత్రహింసలు, ఆ సుఖం కోసమే ఇలా...

దారుణం: లెక్చరర్‌పై లైంగిక వేధింపులు,ప్యాంట్ విప్పి వికృతంగా...

భార్యపై అనుమానంతోనే

భార్యపై అనుమానంతోనే

న్యూఢిల్లీలోని కరవాల్ నగర్ కు చెందిన హీరాలాల్ ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. హీరాలాల్ కు భార్య డోలీ (28) తోపాటు ముగ్గురు పిల్లలున్నారు. భార్య వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హీరాలాల్ రాత్రివేళ భార్యతో ఘర్షణకు దిగాడు. ఆ కోపంలో భార్యను చంపేశాడు.

పిల్లల ముందే చంపేశాడు

పిల్లల ముందే చంపేశాడు

వేరే యువకుడితో వివాహేతర సంబంధం ఉందనే కారణంగా భార్య డోలిపై హీరాలాల్ చంపేశాడు. భార్యతో గొడవపడిన హీరాలాల్ పిల్లల ముందే అత్యంత దారుణంగా భార్య డోలిని హత్య చేశాడు. ఈ భయానక ఘటనతో పిల్లలు భయంతో పరుగులు తీశారు.

భార్యను చంపేసి చేయి కోసుకొన్నాడు

భార్యను చంపేసి చేయి కోసుకొన్నాడు


భార్య డోలిని చంపేసిన తర్వాత ఏం చేయాలో హీరాలాల్‌కు అర్ధం కాలేదు. వెంటనే తన చేయిని కూడ కోసుకొన్నాడు. రక్తం పోతుండడంతో భయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. అసలు విషయం చెప్పాడు. పోలీసులు హీరాలాల్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

కన్నీరు పెట్టుకొన్న పోలీసులు

కన్నీరు పెట్టుకొన్న పోలీసులు

హీరాలాల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతని ఇంటికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే తల్లి మృతదేహం వద్ద ముగ్గురు పిల్లలు ఏడుస్తూ కన్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులు కూడ కంటతడి పెట్టారు. పిల్లల్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man held after killing wife in front of children. A 32-year-old man was arrested for killing his wife in front of his children in northeast Delhi's Karawal Nagar on Friday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి